Homeజిల్లాలుఅనంతపురంబాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని, బాలికలకు చదువుతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమని రెడ్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్ భానుజా ఆదేశాల మేరకు జిల్లా కోఆర్డినేటర్ అనిత, కిసాన్ మిత్ర జిల్లా కోఆర్డినేటర్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉరవకొండలోని కస్తూరిబా గాంధీ పాఠశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని వివరించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండకముందు వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉరవకొండ తాసిల్దార్ అరుణ వైద్యాధికారి వినిత, ఎంఈఓ ఈశ్వరయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి రామాదేవి, రెడ్స్ సిబ్బంది, వీవో లీడర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు