Friday, December 13, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్కింగ్ కారణంగా రాకపోకల సమస్యలు పై మంత్రి కార్యాలయం స్పందన

పార్కింగ్ కారణంగా రాకపోకల సమస్యలు పై మంత్రి కార్యాలయం స్పందన

ధర్మవరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించిన మంత్రి కార్యాలయం సిబ్బంది
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తూ ఉండటం, ధర్మవరం నుంచి దర్శినమల గ్రామానికి వెళ్లేందుకు ప్రయాణించే పల్లె వాసులకు, ఇతర రహదారులపై రాకపోకలు సాగించే వారికి పెద్ద ఇబ్బందులు కలిగిస్తున్న విషయం వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యింది. ఈ అంశంపై మంత్రి కార్యాలయం ఇన్చార్జ్ హరీష్ బాబు స్పందించి. ఆయన మాట్లాడుతూ, ఁఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు పట్టణ సీఐ, ట్రాఫిక్ ఎస్ఐలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందని,. వాహనాల పార్కింగ్ నియమాలు కఠినంగా అమలు చేయడంతో పాటు, దర్శినమల గ్రామం వైపు వెళ్లే వాహనాలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ట్రాఫిక్ నిర్వహణను సక్రమంగా అమలు చేయించుకుంటాం అన్నారు.
ముఖ్యంగా, ఆ ప్రాంతంలో పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకోని, దారి మార్గాలను సమర్థవంతంగా మల్లించి రాకపోకలు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని మొదటి మరువ దగ్గర రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం రాకపోకలకు చాలా ఇబ్బంది కలగడం వలన ప్రజలు, వివిధ పత్రికలు ద్వారా సమాచారం అందుకున్న ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు, ఎన్డీఏ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. తదుపరి 40 లక్షల అంచనా తో రోడ్లను బాగు చేసే పనిని త్వరలో చేపడతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు