వి శాలంద్ర ధర్మవరం:: హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ 65వ పుట్టిన రోజు వేడుకలు బాలయ్య అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిద్దయ్య గుట్టలోని నరసింహస్వామి ఆలయంలో బాలయ్య పేరిటన పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి అందరూ బాలకృష్ణకు జన్మదిన వేడుకలను తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ వారి తండ్రిగారైన ఎన్టీ రామారావు ఆదర్శంగా తీసుకొని పలుమార్లు హిందూపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, హిందూపురం ప్రజల హృదయాలలో దేవుడుగా నిలిచాడని తెలిపారు. అంతేకాకుండా వివిధ నగరాల్లో ఉచితంగా పేదలకు ఆసుపత్రులలో చికిత్సలు నిర్వహించడం కూడా జరుగుతోందని తెలిపారు. వారి అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES