Homeజిల్లాలుఅనంతపురంజర్నలిస్ట్ ఆరోగ్యానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు సాయం...

జర్నలిస్ట్ ఆరోగ్యానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు సాయం…

- Advertisement -

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఇటీవల అనారోగ్యానికి గురైన కళ్యాణదుర్గం బిగ్ టీవీ రిపోర్టర్ ఇషాక్ ను ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన చికిత్స చేయించి, ఆరోగ్యం కుదుటుపడేదాక చొరవ తీసుకుని, ఆర్థిక సాయం అందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కి స్థానిక జర్నలిస్టులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రుల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే చూపిన చొరవ ప్రశంసనీయమని జర్నలిస్టులు కొనియాడారు. వృత్తి ధర్మం కోసం అహర్నిశలు నిస్వార్ధంగా సేవలు అందించే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు సూచించారు. స్థానిక జర్నలిస్టులు ఎమ్మెల్యే సురేంద్రబాబు ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లు కరణం తిప్పేస్వామి, టివి 5 రవి, పూజారి మల్లికార్జున, తిమ్మరాజు, ఇషాక్, హరి, నరసింహులు, రూపేష్ , సోము, షఫీ, అస్లామ్, ముభారక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు