అన్ని వసతులతో కన్వెన్షన్ హాల్‌ను నిర్మించిన రఘునాథ్ గౌడ్‌కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ
విశాలాంద్ర -కొత్తూరు : రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌ను బుధవారం ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రఘునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని వసతులతో నిర్మించిన ఈ కన్వెన్షన్ హాల్‌ను ఎమ్మెల్సీ ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శుభకార్యాలు, వివాహ వేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అన్ని వసతులతో కూడిన కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ హాళ్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కొందుర్గు మండల కేంద్రంలో ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల రఘునాథ్ గౌడ్‌ను అభినందించారు. ఈ కన్వెన్షన్ హాల్ ప్రజలకు మంచి సేవలు అందిస్తూ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామకృష్ణ కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్, మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి, విశ్వనాధ్ పూర్ సర్పంచ్ శ్రీలత రాములు,మాజీ సర్పంచులు జనార్దన్ గౌడ్,గోపాల్ నాయక్, కొందుర్గు ఉపసర్పంచ్ చంద్రశేఖర్,ఉత్తరస్ పల్లి ఉపసర్పంచ్ అలీం భాయ్,నాయకులు వసూరి,విజయ్,నవీన్, నవాజ్ రెడ్డి,వెంకటేష్,అనంత రాములు,లింగం,లక్ష్మణ్,శ్రీకాంత్,నర్సిములు,గణేష్,తదితరులు పాల్గొన్నారు.


