విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థిని విద్యార్థుల కొరకై విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మాక్ ఎలక్షన్స్ (ప్రత్యక్ష ఎన్నికలు) నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ పీపుల్ లీడర్,అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్ పదవుల కోసం పోటీపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానాల పట్ల విద్యార్థుల ప్రాథమిక అడుగుల కోసం విద్యార్థులకు చిన్ననాటి నుండే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగించడం కోసం ఈ మాక్ ఎన్నికలు పాఠశాలలో నిర్వహించామని తెలిపారు.పాఠశాల డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి, శెట్టిపి పద్మ మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో మాక్ ఎలక్షన్స్
- Advertisement -
RELATED ARTICLES


