Homeజాతీయంఎల్‌డీఎఫ్ గెలుపునకు మోదీ ఆరాటం: రాహుల్ గాంధీ

ఎల్‌డీఎఫ్ గెలుపునకు మోదీ ఆరాటం: రాహుల్ గాంధీ

- Advertisement -

కన్నూర్(కేరళ): అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్`బీజేపీ మధ్య అవగాహన కుదిరిందని, ఎల్‌డీఎఫ్ గెలుపునకు ప్రధాని మోదీ ఆరాట పడుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేరళలోని పెరంuల్రో మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీజేపీ, ఎల్‌డీఎప్‌లపై ఆరోపణలు చేశారు. ఇక్కడ లెఫ్ట్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని, ఎల్‌డీఎఫ్ గెలవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్నారు. ఎల్‌డీఎఫ్, బీజేపీ కలిసిన ఉమ్మడి శత్రువును తమ కూటమి యూడీఎఫ్ ఎదుర్కొంటోందన్నారు. కోళికోడ్ జిల్లాలోని కన్నూర్, కళ్లాచి, పెరంబ్ర, కోయిలాండిలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆయన వెంట సీపీఎం మాజీ నేతలు వి.కున్హికృష్ణన్, టీకే గోవిందన్ ఉన్నారు. వారిరువురు ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారికి యూడీఎఫ్ మద్దతిస్తోంది. ‘ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయి. తొలిసారిగా బీజేపీ, ఎల్డీఎఫ్ పొత్తు పెట్టుకోవడాన్ని చూస్తున్నాం. లెఫ్ట్ పార్టీలు మితవాదులతో పొత్తు పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారి సిద్ధాంతాలు పూర్తిగా వైరుధ్యంతో కూడుకున్నవి. ఈ పొత్తు నచ్చకే సీనియర్ నేతలు బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఇతర చోట్ల మతం, దేవుడి గురించి మాట్లాడే మోదీ… కేరళలో ఆ విషయాలను ప్రస్తావించరని విమర్శించారు. శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల స్కాం గురించి ఇప్పటివరకూ ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రజల్లో బీజేపీపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. మతవాద రాజకీయాలు ఎన్నాళ్లూ పనిచేయవన్నారు.



RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు