విశాలాంధ్ర-రాప్తాడు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని అశోక సచి విశ్వవిద్యాలయం గురువారం రాత్రి నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణసమీరకు ప్రతిష్టాత్మకమైన ‘మాంటిస్సోరి ఎలీట్ విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారాన్ని ఆర్ డి టి మహిళా సాధికారత చైర్మన్ విశాల ఫెర్రర్ ప్రదానం చేశారు. వక్తలు మాట్లాడుతూ విద్యా రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి మరియు వినూత్న విద్యా విధానాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందన్నారు. మాంటిస్సోరి పాఠశాలల వ్యవస్థాపకురాలు,
నానమ్మ కళ్యాణమ్మ ఆశయాల వారసురాలిగా..
ఉన్నత విద్యను అభ్యసించి, ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఆమె నేర్పిన అక్షరాలకు కృష్ణసమీర ప్రాణం పోశారన్నారు. “నువ్వు పడు.. కానీ తిరిగి లేచి నిలబడు” అనే పట్టుదలతో, నానమ్మ ఆశయాలను భావితరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న విద్యాప్రధాతగా ఆమె గుర్తింపు పొందారన్నారు. పురస్కారం అందుకుంటున్న తరుణంలో వేదికపై ఆమె గౌరవం రెట్టింపైంది. ఈ అవార్డు ఆమె సాధించబోయే మరిన్ని విజయాలకు ఆరంభం మాత్రమేనని సభికులు కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణసమీర గారు మాట్లాడుతూ.. “ఈ విజయం వెనుక నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నానమ్మ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఇది కేవలం నా వ్యక్తిగత విజయం కాదు, మాంటిస్సోరి కుటుంబం సాధించిన విజయం. ఈ పురస్కారం నాపై బాధ్యతను మరింత పెంచింది. విద్యా సేవలో నిరంతరం కృషి చేస్తాను” అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆమెను ఘనంగా అభినందించారు.
మాంటిస్సోరి ఎలీట్ కరస్పాండెంట్ కృష్ణసమీరకు ‘విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారం
- Advertisement -


