Thursday, March 13, 2025
Homeజిల్లాలుకర్నూలుజగనన్న కాలనీలో బోరుకు మోటారు ఏర్పాటు

జగనన్న కాలనీలో బోరుకు మోటారు ఏర్పాటు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని జగనన్న కాలనీలో చెడిపోయిన బోరుకు ఎంపీడీఓ నాగరాజు స్వామి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల క్యూరింగ్ కు నీటి కొరతను తీర్చేందుకు చెడిపోయిన బోరుకు కొత్త కరెంటు మోటార్ ను బిగించినట్లు తెలిపారు . వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో చెడిపోయిన చేతిపంపులు అన్నింటినీ మరమ్మతులు చేయించినట్లు ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు