Wednesday, July 2, 2025
Homeజిల్లాలువిజయనగరంరాజాం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నంది సూర్య ప్రకాశరావు ఏకగ్రీవం

రాజాం పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నంది సూర్య ప్రకాశరావు ఏకగ్రీవం

పార్టీ బలోపేతానికి కృషి చేయండి ఎమ్మెల్యే కొండ్రు

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం పట్టణ పార్టీ ప్రధాన కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. తెదేపా రాజాం పట్టణ పార్టీ అధ్యక్షులు గా రెండవసారి కూడా నంది సూర్య ప్రకాశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శి గా శాసపు రమేష్ కుమార్ ,పట్టణ కోశాధికారి గా
పిల్లా సత్యం నాయుడును పార్టీ నేతలు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తో విశాఖలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ను మర్యాద పూర్వకంగా కలిసి దుస్సలువతో సత్కరించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో గిరడ ఉమామహేశ్వర రావు తదితర నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు