తమకెవ్వరూ దేశభక్తి గురించి ఉపన్యాసాలివ్వాల్సిన అవసరం లేదని గవర్నర్‌ని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆర్.ఎన్ రవి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే బాగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం మేము చేపట్టిన పథకాలే. ఈ ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఒక విజయం సాధించిన తర్వాత, అంతకంటే గొప్పది మరొకటి వస్తుంది. విజయం తర్వాత విజయాన్ని సృష్టించడం ద్రవిడ నమూనా ప్రభుత్వ ముఖ్య లక్షణం’ అని అన్నారు. కాగా, ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అతను పదే పదే అదే కారణం చెప్పి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. నేను దేశం పట్ల జాతీయ గీతం పట్ల ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిని. మాకెవ్వరూ దేశభక్తి గురించి ఉపన్యాసానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నర్ చర్యలు నన్ను బాధపెడుతున్నాయి. శాసనసభ ప్రారంభంలో రాష్ట్ర గీతం (తమిళ థారు వాఝ్త), చివరిలో జాతీయగీతం పాడటం సంప్రదాయం అని అసెంబ్లీలో స్టాలిన్ నొక్కి చెప్పారు.అసెంబ్లీలో మహిళలకు ‘విడియల్ పయనం’ పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం, నెలవారీ పెన్షన్ పథకం, పొంగల్‌కి అదనంగా మూడువేలు, పది లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపీణీ, లైబ్రరరీ, రోడ్లు, తాగునీటి పథకాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 1.34 క్షల కోట్లకు రుణాలను మంజూరుచేసినట్లు స్టాలిన్ చెప్పారు. తన ప్రభుత్వం ప్రజల జీవితాలోల కొత్త ఉదయాన్ని తెచ్చిందని స్టాలిన్ అన్నారు.


