Homeజాతీయం9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

- Advertisement -

సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా మూడో భాష అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తొమ్మిదో తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. దీనికి బదులు.. ఏదైనా కొత్త భాషను ఐదు లేదా ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో జవహర్‌ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్‌ (సీబీఎస్‌ఈ అంశంపై కాకుండా)ను విచారించిన జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం త్రిభాషా విధానంపై ఈ విధంగా వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో త్రిభాషా విధానం అమలు అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. వీటిని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జేఎన్‌వీ ఏర్పాటును సమర్థిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వగా.. దీనిని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, సీబీఎస్‌ఈలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు