Homeజిల్లాలుఅనంతపురంగూగూడు కుళ్ళాయి స్వామి హుండీ… ఈసారి భద్రమేనా?

గూగూడు కుళ్ళాయి స్వామి హుండీ… ఈసారి భద్రమేనా?

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల పరిధిలోని గూగుడు శ్రీ కుళ్ళాయి స్వామి ఆలయ హుండీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల అనంతరం వెలుగులోకి వచ్చిన ఃపచ్చ హుండీ మాయంః ఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడంతో, ఈసారి హుండీ భద్రతపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఏడాది హుండీ లెక్కింపు తేదీని అధికారులు ఇప్పటికీ ప్రకటించకపోవడం కూడా భక్తుల్లో మరింత ఉత్కంఠకు, అనుమానాలకు తావిస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో తేదీ, సమయాన్ని ముందుగానే వెల్లడించి, పూర్తి పారదర్శకంగా హుండీ లెక్కింపు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.గత ఏడాది సంచలనం సృష్టించిన హుండీ ఘటన విచారణలో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. విచారణ ఎక్కడికి చేరింది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అధికారికంగా ఎందుకు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు? అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.స్థానికంగా వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, గత ఏడాది ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులు ఈ ఏడాది కూడా అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారనే వాదనలు భక్తుల్లో మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి. మరోవైపు, గత ఏడాది వివాదం నేపథ్యంలో ఈసారి హుండీ లెక్కింపులో పాల్గొనేందుకు కొందరు అధికారులు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఈ పరిస్థితుల్లో ఈసారి హుండీ లెక్కింపును వీడియో రికార్డింగ్, సీసీటీవీ నిఘా, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మీడియా సమక్షంలో నిర్వహించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది మిస్టరీకి ఈసారి అయినా తెరపడుతుందా? హుండీ లెక్కింపు తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు? లేక మరోసారి అనుమానాలకే ఆస్కారం కల్పిస్తారా? అన్నది ఇప్పుడు భక్తుల్లో ప్రధాన చర్చగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు