సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్ ద్వారా చర్చించి, ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించింది. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన సేవలకు గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.ప్రభుత్వ నిర్ణయం మేరకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామంలో బుధవారం ముద్రగడ అంత్యక్రియలు జరగనున్నాయి.
ముద్రగడకు అధికారిక లాంఛనాలు..
- Advertisement -
RELATED ARTICLES


