Wednesday, February 18, 2026
Homeఅంతర్జాతీయంమరికొన్ని గంటల్లో ఉరి..

మరికొన్ని గంటల్లో ఉరి..

- Advertisement -

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం నిమిషను ఉరి తీయనున్నారు. ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇకపై చేసేదేమీ లేదని భారత ప్రభుత్వం చేతులెత్తేసింది. కుటుంబం మాత్రం నిమిషను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఉన్న ఒకదారి అగమ్యగోచరంగా మారింది.

నిమిష ప్రియను కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే బ్లడ్ మనీ. హతుడి కుటుంబం అడిగినంత డబ్బు ఇవ్వగలిగితే.. చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితమే నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద 10 లక్షల డాలర్లు సిద్ధం చేసుకుంది. అయితే, నిమిష కుటుంబానికి, హతుడి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు. పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు. తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపనని తేల్చి చెప్పాడు. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్లడ్ మనీ వాయిదా పడింది. ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు