Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు సేవలు చేయడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు సేవలు చేయడమే మా లక్ష్యం..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు సేవలు చేయడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి), అధ్యక్షులు బివి. రమణ, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 107వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో 350 మంది రోగులకు వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం కుమారులు దాసరి వెంకటేశులు, దాసరి రమాదేవి వ్యవహరించడం పట్ల కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో వైద్యులైన వివేక్ కుల్లాయప్ప, వెంకటేశ్వర్లు సాయి స్వరూప్ సతీష్ కుమార్ జై దీపు నేత విట్టల్, విజయ్ కుమార్ లు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్య సూత్రాలను వివరించారు అని తెలిపారు. బిపి, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధనాథం చిన్నికృష్ణ బండి నాగరాజు మామిళ్ళ అశ్వత్త నారాయణ, విజయ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు