Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షులు డి.నాగభూషణ

విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు డి. నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ జి. పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాల యందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్ ధర్మవరం, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి నారాయణప్ప జ్ఞాపకార్థం వారి సతీమణి దాసరి బసమ్మ కోడలు దాసరి లక్ష్మీ దేవమ్మ కుమారుడు దాసరి రామచంద్ర దాతృత్వముతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలుపుతూ దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 118 మంది కంటి రోగులు రాగా, అందరికీ కంటి వైద్య చికిత్సలను శంకరా కంటి ఆసుపత్రి వైద్యులు చికిత్సలు అందించగా అందులో 77 మంది మాత్రమే కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరందరిని కంటి ఆపరేషన్ల నిమిత్తం బెంగళూరుకు కూడా తరలించడం జరిగిందని తెలిపారు. ప్రతినెల రెండవ ఆదివారం ఈ ఉచిత వైద్య శిబిరమును నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. దాతల సహాయ సహకారములతో ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతృప్తిగా, సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా నేత్రదానం చేయించి, అందత్వాన్ని నివారించాలని, అప్పుడే రెండు జీవితాలలో వెలుగులు వస్తాయని తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చడం జరిగిందని తెలిపారు. ఉచిత వసతి, ఉచిత ప్రయాణం, ఉచిత ఆపరేషన్లు, ఉచితంగా అద్దాలను కూడా తాము గత కొన్ని సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. మరి షుగరు, బీపీ ఉన్న రోగులు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకున్న వారికి మాత్రమే కూడా కంటి ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివయ్య, బండారు వెంకటచలం, సుదర్శన్ గుప్తా, నరేందర్ రెడ్డి, కొండయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు , సోలిగాళ్ళ వెంకటేష్, మనోహర్ గుప్తా, పెరుమాళ్ళ దాస్, జయచంద్ర, జయసింహ, రత్న శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు