Homeఅంతర్జాతీయంమా ఉద్యోగాలు మాకే దక్కాలి: జేడీ వాన్స్‌

మా ఉద్యోగాలు మాకే దక్కాలి: జేడీ వాన్స్‌

- Advertisement -

వాషింగ్టన్: హెచ్1బీ వీసాల జారీ మరింత కఠిన తరం కానున్నాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలం చేకూర్చినట్టయింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగాలకు పాల్పడే వారిపై అమెరికా చేపట్టిన చర్యలపై అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పందించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని పునరుద్ఘాటించారు. వీసా మోసాలకు పాల్పడే వారిపై అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. విస్కాన్సిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్‌ మాట్లాడుతూ...‘అత్యున్నత ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వీలుగా హెచ్-1బీ వీసాను రూపొందించాం. కానీ, కొన్ని పెద్ద కంపెనీలు, వ్యక్తులు ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుని అమెరికా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము కాపాడటంతో పాటు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యం. వీసా దుర్వినియోగం చేసేవారిని ఇకపై ఉపేక్షించబోం. అలాంటి వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదు. వీసా వ్యవస్థలో మోసాలను అరికట్టేందుకు కార్మిక శాఖ విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తోంది’ అని స్పష్టం చేశారు. దీనితో హెచ్1బీ వీసాల జారీలు మరింత కఠినతరం కానున్నాయి. వాస్తవంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీసాలపై దృష్టి సారించారు. వీసాల ఫీజు పెంచడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు