Wednesday, July 2, 2025
Homeజిల్లాలుకర్నూలుపంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు దస్తగిరి, లక్ష్మి, స్వామినాథ్, శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ కొందరు ఆకతాయిల వలన ఆచరణకు అమలు కాని కోరికలను తీర్చలేకపోవడంతో ఐవీఆర్ఎస్ కాల్సు చేసి అవాస్తవాలు చెపుతున్నారని, దీంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఉదయం 6 గంటలకే విధులకు హాజరు కావాలని విషయం తమ వ్యక్తిగత జీవితం హరించే విధంగా ఉందని, ఏ శాఖకు లేని నిబంధనలు పంచాయతీ రాజ్ శాఖలోనే ఉండడం సమంజసం కాదన్నారు. తమకు గ్రామ సచివాలయాల అన్నీ సర్వేల యొక్క విధుల నుంచి, డీడీఓ అధికారముల నుంచి తప్పించాలని కోరారు.73వ రాజ్యాంగ సవరణ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ద్వారా నిర్దేశించిన విధులను మాత్రమే అప్పగించాలన్నారు. గతంలో ఇచ్చిన జీఓ ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లకే శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వాలని, మంచినీటి సరఫరా నిమిత్తం మరియు నీటి ట్యాంకుల శుభ్రత కొరకు 4వేలు జనాభా ఉన్న వారికి ఒక్కరు, 4వేలు జనాభా దాటిన వారికి ఇద్దరు పంపు ఆపరేటర్లను నియమించాలని, సంపద సృష్టి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం, నీటి వసతి ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలన్నారు. విధుల్లో పని ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలవడమే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తలెత్తుతూ మానసికంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. కావున తమరు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సాయితేజ, చిన్నయ్య, సుధ ధనుంజయ్, మంజునాథ్, మహ్మద్ రఫీ, శారద, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు