విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : శెట్టూరుమండలం మాకొడికి ఉన్నత పాఠశాల పాఠశాల స్థలం సేకరణ కోసం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తన వంతుగా రూ. 5లక్షలు విరాళాన్ని అందించి గ్రామస్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు స్పందించిన అదే గ్రామానికి చెందిన శెట్టూరు ఏపీ మోడల్ స్కూల్ పీడీ S. జబీ సలాం తన ఉదారతను చాటుకున్నారు. మాకోడికి ఉన్నత పాఠశాల స్థల సేకరణ కోసం మేము సైతం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు అడుగుజాడల్లో నడుస్తామని వారి స్ఫూర్తితో పీ.డి.జబీ సలాం తన ఒక నెల జీతం రూ.44,370 /- పాఠశాల కోసం ప్రకటించారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన ఎమ్మెల్యే గారికి, ఉపాధ్యాయుడికి మాకోడికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు


