Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుదేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి…

దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలి…

- Advertisement -

సిఐటియు..

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎస్ బి పోతురాజు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల యజమానులకు కార్మికులు బానిసలుగా మార్చే కుట్ర అని, అనేక పోరాటాలు చేసి సాధించుకొన్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల వరకు పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు అమలు చేయవలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడి వర్గానికి కొమ్ముకాస్తున్నారని, కార్మికుడికి కష్టం వచ్చినప్పుడు అడిగే హక్కు లేకుండా ఈ లేబర్ కోడ్స్ వల్ల ఏర్పడుతుందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి కార్మిక ఐక్యతను విచ్చినం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం 12వ తేదీన జరిగే సమ్మె జయప్రదం చేయాలని కిలో కూడా ప్రాథమిక కేంద్రంలో సూర్యనారాయణ, సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు