Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరెవెన్యూ క్లినిక్‌లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం

రెవెన్యూ క్లినిక్‌లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా రైతుల భూ సంబంధిత సమస్యలకు సత్వరంగా పరిష్కారం లభిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం – పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 369-బి,విస్తీర్ణం 4.60 ఎకరముల భూమి నలుగురు అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కార వివాదం కారణంగా కొంతకాలంగా నోషనల్ ఖాతాగా కొనసాగుతూ ఉండేది అని తెలిపారు..ఈ నేపథ్యంలో సదరు అన్నదమ్ములు పరస్పర సమ్మతితో భాగ పరిష్కార వివాదాన్ని పరిష్కరించుకొని, రెవెన్యూ క్లినిక్ నందు అర్జీ సమర్పించి, సదరు పట్టా భూమిని రెగ్యులర్ ఖాతాగా నమోదు చేసి వారి వారి పేర్లపై 1-బి మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు.ఈ విషయమై జాయింట్ కలెక్టర్ విచారణ అనంతరం నివేదికను పంపగా, దాని ఆధారంగా లక్ష్మీనారాయణ,అక్కులప్ప,సత్యనారాయణ. రామాంజనేయులు అనే వారికి వారి వారి హక్కు మేరకు 1-బి పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో మంజూరు చేయడం జరిగిందన్నారు.

రైతుల స్పందన;;రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ వివాదాలు, రికార్డు సమస్యలకు సత్వర పరిష్కారం లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు