Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

ఎంపీడీవో గీతావాణి
పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని ఎంపీడీవో గీతావాణి అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలు 2025-2026 సంబంధించి సర్పంచులు, ఎంపీటీసీలు, వివోఏలు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో గీతావాణి పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టాల్సిన పనులను రూపొందించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ డెవలప్‌ మెంట్‌ ప్లాన్‌ ప్రాముఖ్యత, ఆవశ్యకతను ఎంపీడీవో వివరించారు. ట్రైనర్‌ కృష్ణ, సురేష్ లు హాజరైన సర్పంచులకు, పంచాయితీ కార్యదర్శులకు, డిజిటల్‌ అసిస్టెంట్లకు జిపిడిపి పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఎల్ పిఓ వీరభద్రప్ప, ఈఓఆర్డి విజయభాను, అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివోఏలు, డిజిటల్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు