కనేకల్ విశాలాంధ్ర . కనేకల్ నుండి మాల్యం మీదగా ఉరవకొండ పోయే దారిలో చినుకు పడిందంటే చాలు ఈ దారి అంతా గుంతల ఏర్పడి వర్షపు నీటితో నిండిపోయి అతలాకుతలమవుతున్నది, ఈ దారి కొద్దిపాటి చినుకుల కే దారి అంతా బురదమయం అవుతున్నది.. రాయదుర్గం నుండి ఉరవకొండకు వెళ్లేoదుకు ఈ దారి ప్రదానమైనది.. ఈ దారిలో కనేకల్ గ్రామం దాటగానే వేదవతి హగిరి దగ్గర ఉన్న డేసెట్ కాలువ దగ్గర ఈ తారు రోడ్డు నందు అంతా గుంతల మయం, ఈ దారి నందు బస్సులు ట్రాక్టర్లు వాహనాలు టిప్పర్లు పెద్ద పెద్ద బండ్లు కూడా ఈ దారి మీద వెళ్లవలసిందే. ఈ దారిలో ఏదైనా బస్సు గానీ లారీ గాని ఈ గొంతులో చిక్కుకున్నదంటే ఇంకా అంతే సంగతులు ఏ వాహనం కూడా పోయేదానికి కూడా దారి ఉండదు అటువంటి దారి ఇది. అలాంటిది ఈ దారిలో కనేకల్ దాటగానే హగిరి వేదవతి వరకు ఇదే గుంతలమయంతో దారి పొడుగునా అవస్థలు పడుతూ బిక్కుబిక్కుమంటూ పోతున్న వస్తున్న ప్రజలు అరచేతులో ప్రాణాలు పెట్టుకొని నడుపుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి ఈ దారికి మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


