Homeఆంధ్రప్రదేశ్దాలిపర్తి , పండూరి లకు సన్మానం

దాలిపర్తి , పండూరి లకు సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్త దాలిపర్తి వేమన కు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త పండూరి అప్పారావు కు, “రాష్ట్ర కుమ్మర శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా,” కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన సందర్భంగా, కుమ్మర శాలివాహన సంఘ నాయకులు మెరుగుమిల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మోరంపూడి లోని వారి నివాసం యందు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా దాలిపర్తి వేమన మాట్లాడుతూ ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , కూటమి నాయకులందరికీ మరియు ముఖ్యంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, కుమ్మర సామాజిక వర్గానికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించుట లో కృషి చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఉన్నతికి మరింతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా దాలిపర్తి వేమన తెలియజేయడం జరిగింది. పండూరి అప్పారావు గారు మాట్లాడుతూ తనకు పార్టీ అప్పగించిన పనులను చేస్తూ, కుమ్మరి కులానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి కుల సంఘ నాయకులు మెరుగుమిల్లి సత్యనారాయణ, పేరూరి గంగాధరం, డాక్టర్ వడయార్, శ్రీకాకుళపు దుర్గాప్రసాద్, ఏడిద శ్రీనివాసరావు, కొత్తూరి దుర్గారావు, పెరవలి బుజ్జి, టీవీ రావు, పి.పెద్ది రాజు, దేవగుప్తాపు లక్ష్మణరావు, కాళేశ్వరరావు, పి.శేషాద్రి, దాన శంకర్, తాతారావు, పి.సత్తిబాబు, ప్రవీణ్, కొండేటి రమణ, మరియు ఇంకా అనేకమంది నాయకులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు