-తహశీల్దార్ పి.విజయకుమారి
విశాలాంధ్ర-రాప్తాడు: గ్రామంలో ఆక్రమణలకు గురైన వ్యవసాయ భూములను రక్షించాలని తహశీల్దార్ పి.విజయకుమారికి టీడీపీ నాయకులు, గ్రామస్తులు మరూరు గోపాల్, కేశవ, వడ్లమూడి వెంకటరాముడు, డీలర్ సూరి, ఫీల్డ్ అసిస్టెంట్ కదిరప్ప, మాజీ డీలర్ సూరి, వీరనారప్ప, గంజి నరేష్, కదిరప్ప వినతిపత్రం అందజేశారు. మండలంలోని మరూరు గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఆంజనేయస్వామి, నాగేశ్వరస్వామి, చౌడేశ్వరి, పోతులయ్య స్వామి దేవాలయాల మాన్యం భూములను సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు సంబంధించిన రెండు ఎకరాలు ఆక్రమణకు గురైందని వాటిని తొలగించాలన్నారు. అదేవిధంగా మసీదు నిర్మాణానికి చేయూతనందించాలని ముస్లింలు కోరారు. వీటితోపాటు భూసర్వే, ఇంటి స్థలం, రేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికి అర్జీలు వచ్చాయని తహశీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి, బి.నారాయణస్వామి, కొండారెడ్డి, సర్వేయర్ రామాంజనేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.