ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజుల్లో ప్రత్యేక మినహాయింపు..?
మనోవేదనలో యాజమాన్యాలు..
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సమాజ నిర్మాణంలో ముఖ్యభూమికను పోషించే విద్య జీవనాడిగా నిలుస్తుంది. విద్య వ్యాపారం కాకుండా.. ఎటువంటి లాభా పేక్ష లేని విజ్ఞాన భాండాగారని తయారుచేసి విద్యార్థుల భవితకు, దేశ అభ్యున్నతకు తోడ్పాటు అందించే ప్రైవేటు పాఠశాలలో నిరాశ్రయులకు అండగా నిలువ లేని పరిస్థితి నెలకొంటూ ఉన్నది. అనంతపురం జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో అత్యధిక శాతం ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక వేతనాలు తీసుకుంటున్న వారి ప్రత్యేక ఫీజుల్లో మినహాయింపును పొందడం గమనార్హగా ఉంది?. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ మొదలగు రంగాలలో అత్యున్నత స్థానంలో ఉండేవారు సైతం.. వారి పిల్లల ఫీజులను తగ్గించాలని.. ఆదేశించడం దేనికి ప్రామాణికం.. డొక్కాడితే కానీ రోజు గడసని వారిని ఫీజు తగ్గించాలంటే ఎన్నో ఆంక్షలు తో కూడిన మార్గదర్శకాలను వారి ముందు ఉంచుతారు. ధనవంతులకు రాజ దర్బార్ తో మినహాయింపులు చేపడుతున్న ప్రైవేటు పాఠశాలల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు వాపోతున్నారు. పాఠశాల నిర్వహణ, అధ్యాపకుల , బోధ నేతర ఉద్యోగుల జీతభత్యాలు, విద్యావిధానాల ప్రమాణాలు, పోటీ, పరిపాలన ఖర్చులు చేపట్టడం కష్టతరంగా ఉందని కొందరు యాజమాన్యాలు మనోవేదనను వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథం.. మరుస్తూ.. నిరుపేదలకు విజ్ఞాన వెలుగును అందించి..ప్రైవేట్ పాఠశాల తోడుగా నిలవవలసిన బాధ్యత ,దేశ అభ్యున్నతకు తోడ్పాటున అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
నిరాశ్రయులకు అండగా నిలవలేకపోతున్న ప్రైవేట్ పాఠశాలలు !
- Advertisement -


