శానిటేషన్ వర్కర్లు, శానిటేషన్ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి పట్టణాన్ని సుందరీకరణచేయాలి… టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో పలు వార్డులు లో పరిటాల శ్రీరామ్ సందర్శించారు. ప్రజలు ఎక్కువ భాగం శానిటేషన్ పై పలు ఫిర్యాదులు చేయగా వాటిపై స్పందించిన పరిటాల శ్రీరామ్ ఎర్రగుంట సర్కిల్ లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ విభాగంలో గల శానిటేషన్ అధికారులు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అధికారులను, వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో శానిటేషన్ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని దానిపై తక్షణమే ప్రతి ఒక్కరు దృష్టిసారించి, పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచే బాధ్యతను అధికారులు, వర్కర్లు తీసుకోవాలని వారికి సూచించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడాన్ని పలు వార్డుల్లో గల ప్రజలు నా దృష్టికి తీసుకురావడంతో ఈ సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. భవిష్యత్తులో అధికారులు వర్కర్లు సమన్వయంతో పనిచేసి చెత్తరహిత ధర్మవరంగా ఉంచే విధంగా మనమందరు కృషి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా పలుసమస్యలను అధికారులు, వర్కర్లు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ జనాభా పెరిగిపోయిందని, 2011 జనాభా లెక్కల ప్రకారం శానిటేషన్ సిబ్బందిని కొనసాగిస్తున్నారని, పట్టణ జనాభా 1.70 లక్షలకు పెరిగిందని జనాభా ప్రాతిపదికన శానిటేషన్ వర్కర్స్ ను పెంచే విధంగా చొరవ తీసుకోవాలని పరిటాల శ్రీరామ్ శానిటేషన్ వర్కర్లు కోరారు.అదేవిధంగా పలు సచివాలయాల్లో శానిటేషన్ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే శానిటేషన్ సెక్రటరీ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చారు.అదే విధంగా మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేసే మినీ జెసిబి లు పాడైపోయాయని వాటిని కూడా ఆధునీకరించి రిపేరు చేయించి ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ కు అధికారులు, వర్కర్లు విజ్ఞప్తి చేశారు. స్పందించిన పరిటాల శ్రీరామ్ తక్షణమే మంత్రి సత్య కుమార్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని అంతలోపు ప్రతివార్డులోనూ శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని అధికారులను వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తయారు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


