Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులను శాలువా, బొకెలతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున మా అధ్యాపక బృందాన్ని సత్కరించుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం అని, ప్రతి ఉపాధ్యాయునికి ఈ రోజు ఒక భావోద్వేగ భరిత సందర్భమని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు