విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో గవరవరం గ్రామ శివారులో ఉన్న మేఘాదేవినగర్లో ఆమె పర్యటించారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రహదారులు, మంచినీటి సౌకర్యాలు సరిగా లేవని కాలనీవాసులు మేఘలాదేవికి తెలిపారు. మేఘలాదేవి సంబంధిత అధికారులకు చర్వాణి ద్వారా తెలియచేయుగా అధికారులు సానుకూలంగా స్పందిస్తూ కాలనీవాసుల సమస్యలను పరిష్కరించడానికి ఉన్నత అధికారులకు తెలియచేసి, సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. టిడిపి సభ్యత్వల నమోదును ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు చుక్కల శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.