Homeఆంధ్రప్రదేశ్కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి

కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అసెంబ్లీ పరిశీలకులుగా అవకాశం కల్పించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సీతారామరెడ్డి, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా కంబదహాల్ కు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డిలను నియమించింది. ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమను అసెంబ్లీ పరిశీలకులుగా నియమించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు