Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్కుల ఏర్పాటుతో మానసిక ఉల్లాసం.. ప్రశాంతత...

పార్కుల ఏర్పాటుతో మానసిక ఉల్లాసం.. ప్రశాంతత…

- Advertisement -

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో -శ్రీ సత్యసాయి : ప్రజల మానసిక ఉల్లాసానికి ప్రశాంతతకు పార్కులు ఎంతో దోహదపడతాయని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిత్రావతి చెక్ డ్యాం పరివాహక సమీపంలో జాయ్ లూకాస్ జువెలరీ కంపెనీ సహకారంతో కోటి 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే పార్కు నిర్మాణానికి గురువారం సత్య సాయి సెంట్రల్ కమిటీ సభ్యులు ఆర్జే రత్నాకర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లి సింధూర మాట్లాడుతూ పుట్టపర్తి అభివృద్ధికి తాను ఈ పుణ్యక్షేత్రానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులే ప్రధాన కారణమన్నారు. తాను పుట్టి పెరిగింది కేరళ అయితే అక్కడ ఉన్న సుపరిచయాలతో కేరళకు చెందిన జాయ్ లుక్కాస్ జ్యువెలరీ కంపెనీ ప్రతినిధులు సత్యసాయి బాబా ఆశీస్సులతో పుట్టపర్తి అభివృద్ధికి రూ కోటి 20 లక్షలతో పుడా పార్కుల అభివృద్ధికి ముందుకు వచ్చి భాగస్వాములు కావడం ఎంతో అభినందించిన విషయమన్నారు. ఆ సంస్థ చైర్మన్ జాయ్ ,మరియు ఆ సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణ పనులను రెండు మాసాల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులు కూడా సత్యసాయి బాబా ఆశీస్సులతో పుట్టపర్తి అభివృద్ధికి తమ వంతుగా ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టణ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో పుట్టపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు తన శాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ పార్కులు నిర్మాణం పూర్తయితే పుట్టపర్తి పట్టణంలోని చిన్నపిల్లలకు పెద్దలకు మహిళలకు మంచి వాతావరణం నెలకొని ఎంతో ప్రశాంతతను ఉల్లాసాన్ని కలిగించే విధంగా పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 100వ జయంతోత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు స్పందించి సత్యసాయి బాబా 100 వ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జీవోను విడుదల చేస్తూ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరిక మేరకు జారీచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పల్లె సింధూర చిన్న వయసులోనే అత్యంత అద్భుతంగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల సమస్యల పైన మరియు మహనీయుల ఖ్యాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యేను మాజీమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.పుట్టపర్తి అభివృద్ధిలో పల్లె కుటుంబం వేరు పుట్టపర్తి వేరు కాదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. పుట్టపర్తి లో పార్కుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన కేరళ చెందిన జాయ్ లూకాస్ జువెలరీ కంపెనీ యాజమాన్యానికి పుట్టపర్తి ప్రజల తరఫున ఎమ్మెల్యే తరపున మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా నవంబర్ మాసంలో జరిగే సత్య సాయిబాబా 100వ జయంతోఉత్సవాలకు సత్య సాయి ట్రస్టు సహకారంతో ఆ ట్రస్టు సెంట్రల్ సభ్యులు ఆర్జే రత్నాకర్ ప్రత్యేక కృషితో పుట్టపర్తి పోలీసులకు త్వరలో రూ.1కోటి 10 లక్షల వ్యయంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు సత్య సాయి ట్రస్టు ముందుకు వచ్చినట్లు మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. జాయ్ లుకాస్ కంపెనీ ప్రతినిధి జోయి మాథ్యూ మాట్లాడుతూ, పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సహకారంతో పుట్టపర్తి అభివృద్ధికి జాయిన్ లూస్ కంపెనీ భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు. సత్య సాయి నడయాడిన ఈ ప్రాంతం అభివృద్ధికి తమ వంతు సాయం అందించడం ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం అన్నారు. ఇలాంటి అవకాశాన్ని మేము దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు జాయ్ లుకాస్ కంపెనీ ప్రతినిధి జోయి మాథ్యూ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సువర్ణ ,పుట్టపర్తి డి.ఎస్.పి విజయ్ కుమార్ ,మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ , స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నాగయ్య ,జమునా భాయ్ ,కూటమి పార్టీల నాయకులు సామకోటి ఆదినారాయణ ,గంగాధర్ నాయుడు, పిసి గంగన్న, మహమ్మద్ రఫీ, సురేష్ చౌదరి, కృష్ణ, మురళి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు