Homeజిల్లాలుఅనంతపురంస్తంభాలు నేలచూపు… ప్రమాదాలు జనం వైపు!

స్తంభాలు నేలచూపు… ప్రమాదాలు జనం వైపు!

- Advertisement -


విశాలాంధ్ర -బొమ్మనహల్.. (అనంతపురం జిల్లా) : మండలంలోని గో విందవాడ గ్రామం నుండి ఎస్సీ కాలనీ వరకు రహదారి లో గోవిందవాడ వద్ద పంట పొలాల్లో ఒరిగిపో యిన విద్యుత్తు స్తంభాలు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారి పక్కనే అందరికీ కనిపించేలా ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఒదిగిపోయాయి నేల వాలితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకముందే వీటిని సరిచేయాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మి రెడ్డిని వివరణ కోరగా నేలకొరిగిన స్తంభాలను సరిచేస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు