చేతివృత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి
చేనేత కార్మిక సంఘము జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతకు శతగోపం పెడుతూ మాస్టర్ల వీవర్ల స్వార్థంతో పవర్లూమ్స్ మోసాలతో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చేతివృత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఒకప్పుడు చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడిన మాస్టర్ వీవర్లు, ఇప్పుడు మిల్లుల యజమానులుగా మారి, చేనేత పరిశ్రమకు శాపంగా మారారు అని తెలిపారు. పవర్ లూమ్స్ విస్తరించడం, చేనేత రిజర్వేషన్ చట్టం అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి వచ్చిన 1985 చేనేత రిజర్వేషన్ చట్టం, ఇప్పుడు నేత కార్మికులను పక్కన పడేసి మాస్టర్ వీవర్ల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది అని తెలిపారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, పవర్ లూమ్స్ లో ఉత్పత్తి చేసిన వస్త్రాలను చేనేత వస్త్రాలుగా అమ్ముకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు అని అన్నారు.
ప్రధాన సమస్యలు లలో
మోసపూరిత వల లో భాగంగా మాస్టర్ వీవర్లు పవర్ లూమ్స్ లో ఎక్కువ కూలీలు ఇస్తామని ఆశ చూపించి, చేనేత కార్మికులను ఆ వైపు మళ్లిస్తున్నారు అని తెలిపారు. కార్మికులు చేనేత మగ్గాలను వదిలి పవర్ లూమ్స్ లో చేరిన తర్వాత, కూలీలను భారీగా తగ్గించి, వారి కష్టాన్ని దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.కూలీలు తగ్గింపు లో భాగంగా గతంలో ఒక పవర్ లూమ్ మీద ఒక కార్మికుడు 1000 రూపాయల కూలీ , ఇప్పుడు అదే కార్మికుడికి 500-600 రూపాయల మాత్రమే ఇస్తున్నారు అని తెలిపారు. దీనివల్ల కార్మికుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది అని తెలిపారు.
చట్ట ఉల్లంఘన లో భాగంగా చేనేత కార్మికుల ఉపాధిని కాపాడటానికి ఉద్దేశించిన చేనేత రిజర్వేషన్ చట్టాన్ని మాస్టర్ వీవర్లే ఉల్లంఘిస్తున్నారు అని తెలిపారు. చేనేతకు రిజర్వ్ చేయబడిన 11 రకాల వస్త్రాలను పవర్ లూమ్స్ లో ఉత్పత్తి చేస్తున్నారు అని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు అని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు. పవర్ లూమ్స్ లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పర్యవేక్షించడంలోనూ ప్రభుత్వం శ్రద్ధ చూపడం ఏ మాత్రమూ లేదని మండిపడ్డారు.
చేనేత కార్మికుల జీవితాలను కాపాడటానికి, ప్రభుత్వాలకు మేము కొన్ని డిమాండ్లను అడుగుతున్నామని, అందులో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చేనేత రిజర్వేషన్ చట్టం, 1985ను పకడ్బందీగా అమలు చేసి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. పవర్ లూమ్స్ లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు సరైన వేతనం అందేలా ప్రభుత్వం పర్యవేక్షించాలి అని తెలిపారు. మాస్టర్ వీవర్ల మోసాల నుంచి చేనేత కార్మికులకు రక్షణ కల్పించాలి అని, సంక్షేమ పథకాలు నిజమైన కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం
ఆపేసిన 24 నెల నేతన్న నేస్తం కార్యక్రమానికి మరో మరో 12000 పెంచి 36 వేలకు పెంచి చేనేత కార్మికులందరినీ ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల చుట్టూ పవర్ లూమ్స్ యజమానులు చేరిపోవడంతో చేనేత కార్మికులు వారిని చేరుకోలేకపోతున్నారు అని, చట్టాన్ని కవలించిన వారిని అరికట్టవలసిన ఎయిర్ ఫోర్స్ మెంట్ అధికారులు చేతులెత్తేసి లంచాలు పుచ్చుకొని వెళ్ళిపోతున్నారు అని తెలిపారు. మరి చేనేత కార్మికులను ఆదుకునేది ఎవరు? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచిన చేనేత పరిశ్రమ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఏ ప్రభుత్వం కూడా శాశ్వత పథకాన ఆదుకోలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు వెంకటస్వామి, శ్రీనివాసులు, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.


