Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదివ్యాంగులకు అన్ని సేవలు అందించడమే కేంద్రం లక్ష్యం..

దివ్యాంగులకు అన్ని సేవలు అందించడమే కేంద్రం లక్ష్యం..

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు.
విశాలాంధ్ర ధర్మవరం ; దివ్యాంగులకు అన్ని సేవలను అందించడమే సాక్ష్యం దివ్యాంగ సేవ కేంద్రం యొక్క ముఖ్యము అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు గాంధీ నగర్ లో ఈ సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కేంద్రంలో యు డి ఐ డి కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని, సదరం సర్టిఫికెట్లకు సంబంధించిన సమాచారం అందిస్తా రణి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నెల్లూరు సి ఆర్ సి ద్వారా అందించబడే ఉపకరణాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగ పథకాలపై అవగాహన కల్పించి దరఖాస్తులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దృష్టిలోపం ఉన్నవారికి బ్రెయిలీ పుస్తకములు ఉచితంగా పంపిణీ చేయబడునని తెలిపారు. టెట్టు, సిటీఈటీ, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ లాంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు దరఖాస్తు చేయించబడునని తెలిపారు. చదువుకున్న దివ్యాంగ విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు దరఖాస్తు చేయించబడినది తెలిపారు. ఈ విధంగా దివ్యాంగులకు ఎన్నో అవసరమైన సమాచారాన్ని, పోటీ పరీక్షలను, పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఇలాంటి సేవా కేంద్రాలు దివ్యాంగుల ఆత్మవిశ్వాస్వాన్ని పెంపొందించే దిశగా ఒక గొప్ప అడుగు వేయడం అని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్య వాహ శరత్జి, సాక్ష్యం జిల్లా కన్వీనర్ పవన్కుమార్, డాక్టర్ సుబ్బారావు, శైలేంద్ర, సుధాకర్, లలితా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు