విశాలాంధ్ర-రాజాం : ఈ నెల 12, 13 తేదీలలో శ్రీకాకుళం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో రాజాం డిఏవి స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని అండర్-11 సింగిల్స్ లో ప్రధమ బహుమతి బి. పుష్కర్, రన్నర్ వి. కౌశిక్ నాయుడు, అండర్-11 డబుల్స్ వినర్స్ బి. పుష్కర్ & వి. కౌశిక్ నాయుడు, బాలికలు అండర్-13 డబుల్స్ ద్వితీయ బహుమతి పి. నిషిక, పి. లాస్యప్రియ మరియ అండర్ -13 డబుల్స్ (బాలురు) పి. గోవర్థన్ అన్సుమాన్ ద్వితీయ బహుములు సాధించారని తెలిపారు. డిఏవి స్కూల్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపల్ జె.విజయ్ కుమార్,పిఈటి అప్పలనాముడు, కోచ్ తిరుపతిరావులు విజేతలను అభినందించారు.


