Saturday, March 14, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రముఖ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి బాధాకరం

ప్రముఖ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి బాధాకరం

- Advertisement -

కళా జ్యోతి పాలకవర్గం
గాయత్రి సంఘం, అర్చకుల సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రముఖ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడం చాలా బాధాకరమని కళాజ్యోతి అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, గౌరవ అధ్యక్షులు వెంకటనారాయణ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్థాయిలోనే సినీ చరిత్రలో ఒక మంచి గుర్తింపు పొందిన మహానటుడు ఇక లేకపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అని తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలలో నటించడం జరిగిందని, 750 చిత్రాలకు పైగా వారు నటించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా కళాజ్యోతిలో కొన్ని సంవత్సరాల కిందట ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, తన అమూల్యమైన సందేశాలను ఇవ్వడం కూడా జరిగిందని తెలిపారు. అటువంటి వ్యక్తి మృతి చెందడం కుటుంబానికి తీరని లోటు అని, కుటుంబానికి సంతాపం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా నటుడు కోటా శ్రీనివాసరావు మృతి కుటుంబానికి తీరని లోటు అని గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి కార్యదర్శి విజయ రాఘవేంద్ర, కోశాధికారి తీర్థాల రమణ, కిషోర్, అర్చక సంఘం రాజశేఖర్ నారాయణమూర్తి విజయ్ కుమారులు తమ సంతాపాన్ని తెలుపుతూ నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రాహ్మణ వంశంలో జన్మించి, ఎంతోమందికి వివిధ సేవలను చేస్తూ, సినీ పరిశ్రమలో విలక్షణ నటుడుగా, మంచి గుర్తింపు పొందడం సంతోషించేదగ్గ విషయమని తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. అటువంటి మహానటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త మమ్ములను దుఃఖసాగరంలో ముంచిందని తెలిపారు. వారి ఆశయ సాధనాలకు అందరూ కట్టుబడి ఉండాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు