Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుగా ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) రోటరీ క్లబ్, ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగతేజ, కోడలు కలవల సర్వాణి, మనవళ్లు మీహాన్,దిశాన్(సుకన్య సిల్క్స్- ధర్మవరం) నిర్వహించడం జరిగిందని, అందుకు దాతలకు కృతజ్ఞతలను తెలుపుతూ, దాతలను, కంటి వైద్యులను ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేలాదిమందికి కంటి ఆపరేషన్ లను నిర్వహించి, కంటి వెలుగును ప్రసాదించడం జరుగుతుందని తెలిపారు. నేటి ఈ శిబిరంలో 143 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 114 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరము రోటరీ క్లబ్, శంకర కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ -శ్రీ సత్య సాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి ఆపరేషన్లకు బెంగళూరుకు ఉచితంగా బస్సులో తీసుకొని వెళ్ళుట, భోజన వసతి, కంటి అద్దాలను పంపిణీ చేయటం లాంటివి నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. బిపి షుగర్ అధికంగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తర్వాత వచ్చే శిబిరంలో రావాలని వారు తెలిపారు. గత నెలలో ఆపరేషన్ చేసిన వారికి ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నేత్రదానం చేసి, అంద త్వాన్ని నివారించి, రెండు జీవితాలలో వెలుగు నింపాలని వారు పిలుపునిచ్చారు. శిబిరం చైర్మన్గా కలవల మురళీధర్ వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్, రమేష్ బాబు, రామకృష్ణ, శివయ్య, కొండయ్య, శ్రీనివాసరెడ్డి, అంబికా, కృష్ణమూర్తి, బండారు వెంకటాచలం, సుదర్శన్ గుప్తా, డాక్టర్ నరసింహులు, పెద్దారెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు సుమలత, కార్యదర్శి లక్ష్మి, రాజేశ్వరి దేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు