పాఠశాల హెడ్మాస్టర్ షర్ఫుద్దీన్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సుందరయ్య నగర్ లో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల యందు దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ షర్ఫుద్దీన్ తెలియజేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు దాతలువిలేఖరి భాను మాట్లాడుతూ సుందరయ్య నగర్ ప్రైమెరీ పాఠశాల యందు ప్రతి విద్యార్థికి గత 12 సంవత్సరాలుగా కీర్తిశేషులు మడకం చౌడయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మడకం చందు విద్యార్థులకు కావలసిన సామగ్రినంత ప్రతి సంవత్సరం అందిస్తున్నారన్నారు. దాదాపు 500 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్కేలు, పలకలు తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు అందజేయడం చాలా సంతోషకరం అన్నారు. హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విలేకరి భాను సహాయ సహకారాలు పాఠశాలకు అందిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల అభ్యుదయం కోసం సామగ్రి వితరణ
- Advertisement -
RELATED ARTICLES


