Saturday, March 14, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుంది..

విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుంది..

- Advertisement -

ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం : విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలమ్మ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో ఇటీవల ప్రభుత్వ ద్వారా బదిలీలు జరిగిన సందర్భంగా ఇతర మండలాల నుండి ధర్మవరం కు వచ్చిన ఉపాధ్యాయులకు, ధర్మారం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన 40 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముత్యాలప్ప మాట్లాడుతూ మన బోధన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించినప్పుడే తరగతి గదిలో చక్కటి క్రమశిక్షణ ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా సమన్వయంతో, ఐక్యమత్యంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం సత్కరింపబడ్డ ఉపాధ్యాయులు మాట్లాడుతూ మమ్ములను ఏపీటీఎఫ్ తరఫున సత్కరించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, బదిలీగా వచ్చినవారు, వెళ్లిన వారందరమూ కూడా తరగతి గదులలో మంచి బోధన విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు తో పాటు శ్రీనివాసులు ఈశ్వరయ్య శివానంద కృష్ణమూర్తి గోపాలకృష్ణ వాసు శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు