Saturday, March 7, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ ఆకస్మిక తనిఖీ

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్జేడీ ఆకస్మిక తనిఖీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆర్జేడీ డా. డి. నాగలింగా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాల
ప్రిన్సిపాల్ డా కె ప్రభాకర్ రెడ్డి తో కలసి బోధనా సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు .”ఎఫ్. ఆర్. ఎస్ ” “టి. ఎల్.పి”, “టీచింగ్ డైరీ”…… వంటి బోధనా సంబంధిత అంశాలపై అధ్యాపక బృందానికి అనేక సూచనలు చేశారు. సందేహలను నివృత్తి చేసి వారికి సలహాలు ఇచ్చారు .
తరగతి గదులలోకి వెళ్ళి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బోధనా సిబ్బంది, విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో
వైస్ ప్రిన్సిపాల్ డా ఎస్. చిట్టెమ్మ, ,డా.బి.త్రివేణి, డా ఎస్. షమీఉల్లా, ఎస్. పావని
,ఎం. పుష్ప, బి . ఆనంద్, జి.మీనా, జి.ధనంజయ
తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు