Homeజిల్లాలుశ్రీ సత్యసాయికె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండీ ఆర్మీ అటాచ్ క్యాంపుకు ఎంపికైన ఎన్.సి.సి. క్యాడెట్లు

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండీ ఆర్మీ అటాచ్ క్యాంపుకు ఎంపికైన ఎన్.సి.సి. క్యాడెట్లు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్.సి.సి.. యూనిట్ లో గల ద్వితీయ ,తృతీయ సంవత్సరంలోని మొత్తం 8 మంది ఎన్.సి.సి. క్యాడెట్లు సికింద్రబాద్ లో 76 ఇన్ఫాంట్రీ బ్రిడ్జ్ ఆధ్వర్యములో 15 జూలై నుండి 24 జూలై వరకు జరగబోవు ఎన్.సి.సి.క్యాంపుకు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్, డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి అరుదైన అవకాశం సొంతం చేసుకోవడం కళాశాలకు, ఎంతో గర్వకారణమని, జవాన్ల దైనందిన జీవితం ఉదయం 5.30కు నుండి రాత్రి 9.30 వరకు ఉండే శిక్షణను చాలా దగ్గరగా చూసే అవకాశం క్యాడెట్లకు దక్కనుంది అని తెలిపారు. ఈ పది రోజుల క్యాంపు జీవితంలో అత్యున్నత స్థానానానికి చేరుటలో కీలక పాత్ర పోషిస్తుందని ఎన్.సి.సి.క్యాడెట్లకు అభివందనలు తెలిపారు.
ఈ క్యాంపులో కర్నూలు గ్రూపు నుండి 55 మంది క్యాడెట్లు ఎంపిక కాగా అందులో 8 మంది మన కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయమని ఎన్.సి.సి.ఎ.ఎన్.ఓ. లెఫ్టినెంట్ యస్. పావని, డా|| బి. గోపాల్ నాయక్ తదితర అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ క్యాంపుకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి. లక్ష్మన్న, ఎమ్. నిఖిల్, ఎస్. సాయి నిఖిల్, ఏ. బాల ఓబులేసు, జె. వెంకట సాయి కృష్ణ, తృతీయ సంవత్సరము చదువుతున్న టి. పోతి రెడ్డి, కె. ధనుష్, ఎస్ అహమ్మద్లు ఎంపికైనారు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు