Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆరు సంవత్సరాలకు ఓ మహిళకు న్యాయం జరిగిన ఘటన

ఆరు సంవత్సరాలకు ఓ మహిళకు న్యాయం జరిగిన ఘటన

- Advertisement -

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం రెవెన్యూ డివిజన్లో రామగిరి మండలం గంతి మర్రి గ్రామానికి చెందిన కుమారి పోలేరమ్మ నివాస స్థలానికి ఆరు సంవత్సరాల తర్వాత కలెక్టర్ చేతన్ ద్వారా తగిన న్యాయం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను ఆర్డిఓ మహేష్ వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ
కుమారి పోలేరమ్మ గత కొన్ని సంవత్సరాలుగా తమ నివాస స్థలానికి సంబంధించి ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు అని, ఆమె నివాసానికి ఆనుకుని ఉన్న కొంతమంది వ్యక్తులు, ఆమె స్థలంపై అనధికారికంగా కాంపౌండ్ గోడ, మెట్లు (స్టెప్స్) ఎలక్ట్రికల్ వైర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె ఫిర్యాదులో తెలపడం జరిగిందన్నారు.
ఈ సమస్యకు సంబంధించి గత ఆరేళ్ల కాలంలో ఇప్పటివరకు ఆమె సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, సరైన స్పందన రాకపోవడంతో చివరికి జిల్లా కలెక్టర్ నువ్వు ఆశ్రయించడం జరిగిందన్నారు. కలెక్టర్ ఈ సమస్యను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారి గా మాకు ఆదేశించడం జరిగిందన్నారు. తదుపరి
రెవిన్యూ అధికారులు పరిశీలన నిర్వహించి, అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడ, మెట్లు ఎలక్ట్రికల్ తీగలు నిజంగా కుమారి పోలేరమ్మ స్థలంలోనే ఉన్నట్లు గుర్తించి, తక్షణమే వాటిని తొలగించడం జరిగిందన్నారు. అనంతరం, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు అధికారులచే స్థలాన్ని కొలతలు వేసి స్పష్టమైన బౌండరీని గుర్తించటం జరిగిందన్నారు. తదుపరి
కుమారి పోలేరమ్మ సందర్భంగా జిల్లా కలెక్టర్ , ఆర్డీఓకు, రెవిన్యూ అధికారులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు