Wednesday, February 18, 2026
Homeఆంధ్రప్రదేశ్రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ పూర్తి చేయాలి `లేనిపక్షంలో సీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారు : జీ...

రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ పూర్తి చేయాలి `లేనిపక్షంలో సీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారు : జీ ఈశ్వరయ్య

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ పూర్తి చేయకపోతే చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలి పోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను ఆయన పరిశీలించారు.ఈయన వెంట ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పీ రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌ రంగనాయుడు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం, సీపీఐ నాయకులు రాధాకృష్ణ, మునెప్ప, సుంకయ్య, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెడ్‌లెగ్యులేటర్‌ను పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాక్యలపై చంద్రబాబునాయుడు ప్రజలకు స్పష్టంగా సమాదానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు నాలుగు గొడల మద్య మాట్లాడుకున్న విషయాలు ప్రజలకు చెప్పకుండా మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా రాయలసీమ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలియచేస్తున్నామన్నారు. 2000 సంవత్సరంలోపు ట్రిబ్యూనల్‌ నిర్ణయం ప్రకారం ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి ఉంటే నికరజలాలు వాడుకునే హక్కులు ఉండేవన్నారు. నేడు రాయలసీమ ప్రజలు వరద నీటిపై ఆదారపడవలసిన అవసరం లేకుండా పోయోదన్నారు. తెలుగుగంగ, వెలుగొండ, హంద్రీనివా, ఆర్‌డీఎస్‌ నేడువరద వచ్చినపుడే ఈనీటిని వాడుకోవలసిన అవసరం లేకుండా పోయోదని రాయలసీమ సస్యశ్యామలం అయ్యోదన్నారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దీనిపై వరద నీటి కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పడం జరిగిందన్నారు. రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు వలన పోతిరెడ్డి పాడు వద్ద నుండి ప్రతిరోజు మూడు టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈప్రాజెక్టును చంద్రబాబునాయుడురేవంత్‌రెడ్డి కుముమ్మకై ఎగనామం పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజలు కరువులో పుట్టి, కరువులో పెరిగి కరువులోనే చస్తున్నారని రాయలసీమకు నికరజలాలు లేకపోవడం పాలకుల కుట్ర అన్నారు. నీటి వివాదాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయన్నారు. నేడు నీటి కోసం యుద్దాలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారని దీనిని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు గుండెకాయలాంటి ఈ రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాయరన్నారు. ఏపీ అంటే ఏ అమరావతి` పీ అంటే పోలవరంగా మారిందని అమరావతి పోలవరం జపం చేస్తూ లక్షల కోట్లు అక్కడే ఖర్చుచేస్తూ రాయలసీమ రైతుల నోట్లో మట్టికొట్టడం దుర్మార్గమని వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు కోసం కలసి వచ్చే రైతుసంఘాలు, కలసి వచ్చే పార్టీలను కలుపుకొని ప్రాజక్టు కోసం పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు