Homeక్రీడలుఅదరగొడుతోన్న ఆర్సీబీ

అదరగొడుతోన్న ఆర్సీబీ

- Advertisement -

పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరువ
ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం

ముంబై: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అదరగొడుతోంది. ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరి బంతికి బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరువైంది. 39/3తో జట్టు కష్టాల్లో ఉన్నప్ప్పుడు క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్య (73…46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు కాలు పట్టేసినా కృనాల్ తగ్గలేదు. మెరుపు షాట్లతో ఆర్సీబీని విజయానికి చేరువ చేశాడు. ఆ జట్టు గెలుపునకు చివరి మూడు బంతులకు 9 పరుగులు అవసరం కాగా… భువనేశ్వర్ (7 నాటౌట్) సిక్స్ బాదడంతో ఆర్సీబీ విజయం ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్య మాట్లాడుతూ…
‘నాకు కఠిన పరిస్థితులంటే ఇష్టం. అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎల్లప్ప్పుడూ సిద్ధంగా ఉంటా. బ్యాటింగ్ చేస్తున్నప్ప్పుడు నాకు చాలా కండరాల నొప్ప్పులు వచ్చాయి. అవి పిక్కల నుంచి మొదలై వీపు వరకు పాకాయి. ఇకపై నేను ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటాను. భువనేశ్వర్ ఆడిన ఆ షాట్ ఈ మ్యాచ్‌కే హైలైట్. ఇది కేవలం సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడాల్సిన పిచ్. ఇక్కడ పూర్తి ఏకాగ్రతతో, ఎంతో ఓర్పుతో పోరాడాల్సి ఉంటుంది’ అని కృనాల్ పేర్కొన్నాడు.
గతంలో ముంబయి ఇండియన్స్‌కు ఆడిన కృనాల్… అప్పటి అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ‘కీరన్ పొలార్డ్ నాకు పెద్ద అన్నయ్య లాంటివాడు. ముంబయి జట్టులో ఆరేళ్లు అత్యుత్తమంగా ఆడా. నేను, హార్దిక్, పొలార్డ్ జట్టుకు వెన్నెముకలా ఉండేవాళ్లం. మేం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించి ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాం. 2021లో మేము ముగ్గురం కలిసి చివరి మ్యాచ్ ఆడాం. ముగ్గురం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని ‘మేము కలిసి ఆడటం ఇదే చివరిసారి’ అని భావోద్వేగానికి గురైన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. పొలార్డ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ఫార్మాట్‌లో అతను అత్యుత్తమ ఆటగాడు. ఎన్నో ట్రోఫీలు, మ్యాచ్‌లు గెలిచాడు’ అని కృనాల్ పాండ్య భావోద్వేగభరితంగా చెప్పాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు