విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, ధర్మవరం రూరల్, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల నియోజకవర్ గం తుది ఓటరు జాబితా-2025 విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తుది ఓటరు జాబితా లో మొత్తం పురుషులు 1,22,028 ఓటర్లుగా, స్త్రీలు 1,24,247 ఓటర్లుగా, థర్డ్ జెండర్ 20 ఓటర్లుగా మొత్తం 2,46,295 ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని తెలిపారు. మండలాల వారిగా వెళితే ధర్మవరం పట్టణం లో పురుషులు 52,053 ఓటర్లు, స్త్రీలు 53,524 ఓటర్లు, ఇతరులు 14 వెరసి 1, 05,591 మంది ఓటర్లు కలరని, ధర్మవరం రూరల్ పరిధిలో పురుషులు 17,280 ఓటర్లు, స్త్రీలు 17,395 ఓటర్లు, ఇతరులు ఒకటి వెరసి 34,676 మంది ఓటర్లు, తాడిమర్రి మండలంలో పురుషులు 12,857 ఓటర్లు, స్త్రీలు 12,756 ఓటర్లు, ఇతరులు ఒకటి కలుపుకొని మొత్తం 25,614 మంది ఓటర్లు, ముదిగుబ్బ మండలంలో పురుషులు 23,691 ఓటర్లు, స్త్రీలు 24, 021 మంది ఓటర్లు, ఇతరులు 1 కలిపి 47,713 మంది, బత్తలపల్లి మండలంలో పురుషులు 16,147 మంది ఓటర్లు, స్త్రీలు 16, 551 మంది ఓటర్లు ఇతరులు మూడు కలిపి 32,701 మంది ఓటర్లు కలరని తెలిపారు. మొత్తం నాలుగు మండలాలలో ఓటర్లు 2, 46,295 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
ధర్మవరం నియోజకవర్గ తుది ఓటర్ జాబితాను విడుదల చేసిన ఆర్డిఓ మహేష్
RELATED ARTICLES