నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోక్సభకు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చర్చకు సంబంధించిన నిబంధనలు, తేదీ, సమయాన్ని నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ ఓం బిర్లాను ఆయన కోరారు. బుధవారం మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును చర్చపై ప్రకటన చేయాల్సిందిగా స్పీకర్ కోరగా ఆయన ఈ సమాధానమిచ్చారు. అంతకుముందే స్పీకర్ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేయాలన్నారు.
నీట్ పేపర్ లీక్పై పార్లమెంటులో చర్చకు సిద్ధం
- Advertisement -
RELATED ARTICLES


