Friday, April 18, 2025
Homeఅంతర్జాతీయంభారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధం : జిన్ పింగ్

భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధం : జిన్ పింగ్

చైనాపై ట్రంప్ ఊహించని విధంగా ఏకంగా 125 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. దీంతో, చైనాకు భారీ షాక్ తగిలింది. చైనా విధానాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన ప్రకటన చేశారు. బీజింగ్ లో జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్ పింగ్ మాట్లాడుతూ… భారత్ తో అభిప్రాయ భేదాలను తగ్గించుకుని, సరఫరా వ్యవస్థలను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు