విశాలాంధ్ర – అనపర్తి : ఆరుగాలం పండించిన పంట చేతికి అందొస్తుందనుకున్న సమయం లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తాను వర్షాలు వల్ల, ఈదురు గాలుల వల్ల అనపర్తి మండలంలోని వరి పొలాలు నేలనంటాయి. సోమవారం ఉదయం నుండే మొంథా తుఫాను ప్రభావం అనపర్తి లో కనిపించింది. ఈ వర్షాల కు ఈదురు గాలులు తోడు అవ్వడంతో వరి చేలు నేలనంటాయి. చేతికంది వచ్చిన పంట ఇలా నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో వరి సాగు అధికంగా ఉండటంతో ఈ రెండు రోజులు వర్షాలు ఇంకా తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం తో రైతు కుదేలవుతున్నాడు. మండలంలో సుమారు పదివేల ఎకరాల వరి చేను ఉంటుందని అంచనా తుఫాను ప్రభావంతో ఈ రెండు రోజులు గడిచేసరికి ఏమవుతుందో అని రైతులు బిక్కుముక్కుమంటు ఉన్నారు.
వర్షాలతో నేలకొరిగిన వరి చేను
- Advertisement -
RELATED ARTICLES


