ఫెస్ట్ ఘన విజయం
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయంలో నిన్న డిజిటల్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏI), వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో రూపొందించిన ప్రాజెక్టులను వివరించారు.ఈ సందర్భంగా డీన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక విద్య భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతాయని ,వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పిల్లలను తయారు చేయడంతో పాటు భవిష్యత్తులో పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా తయారు చేయడమే మా ధ్యేయం అని, ఇందుకు అవసరమైన మూలాలను ఇప్పటినుంచే మా పాఠశాల యందు వేయడం జరుగుతుంది అని తెలిపారు.
హెడ్ మాస్టర్ కరణ్ స్వరూపా సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవడానికి డిజిటల్ ఫెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం సి ఏ ఓ రవీంద్ర ,వైస్ ప్రిన్సిపాల్ కల్యాణి, ఏవో రంగారెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
రిషి విద్యాలయ డిజిటల్
- Advertisement -
RELATED ARTICLES


